: జేఎన్యూలో అశ్లీల నృత్యాలు, విచ్చలవిడితనం: బీజేపీ నేత సంచలన ఆరోపణలు


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో రాత్రి 8 గంటలు దాటిన తరువాత, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు జరుగుతాయని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడ పూర్తి నగ్న నృత్యాలు జరుగుతాయని, నిత్యమూ కనీసం 3 వేల కండోమ్ లు వాడుతుంటారని, గర్భం ధరించకుండా క్యాంపస్ లోనే ఇంజక్షన్లు తీసుకుంటారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. "మన కుమార్తెలు, సోదరీమణులతో ఇక్కడ చెడుగా ప్రవర్తిస్తున్నారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురును పొగిడే స్థలమిది. ఇక్కడున్నవాళ్లు మోసగాళ్లు" అని విరుచుకుపడ్డారు. "అంతేకాదు, ఇక్కడ నిత్యమూ వేలకొద్ది బీరు బాటిళ్లు వాడుతుంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాటిని ఎవరు తాగుతారు? మీరే ఊహించుకోండి" అని అహూజా అన్నారు. రోజూ 10 వేలకు పైగా సిగరెట్ పీకలు ఇక్కడ లభిస్తాయని, పెద్దఎత్తున తిని పారేసిన బొమికలు కనిపిస్తాయని అన్నారు. ఆయన చేసిన పెను విమర్శలను ఓ టీవీ చానల్ వీడియో రికార్డు చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News