: సీఆర్డీయే ఆఫీసుకు తాళం వేసిన అమరావతి రైతులు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి మండలం నీరుకొండలో ఉన్న సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ) కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపించి వేసిన రైతులు, దానికి తాళం వేశారు. రైతులకు అందజేయాల్సిన చెక్కుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆగ్రహించిన రైతులు, అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. తాము ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ, ఆఫీసుకు తాళం వేయడంతో ఈ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. రైతులకు చెక్కుల పంపిణీ విషయంలో ఉన్నతాధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.