: బాలీవుడ్ నటుడితో సినీ నటి గజాలా వివాహం


'స్టూడెంట్ నెంబర్-1' చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కథానాయిక గజాలా వివాహం చేసుకోబోతోంది. బాలీవుడ్ నటుడు ఫైజల్ రజాఖాన్ ను రేపు పెళ్లాడనుంది. నటి గజాలాతో తనకు నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉందని, అది ప్రేమగా మారిందని ఫైజల్ తెలిపాడు. అయితే పెళ్లి ఎక్కడ జరగనుందనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. 'కలుసుకోవాలని', 'అల్లరి రాముడు', 'తొట్టి గ్యాంగ్', 'మల్లీశ్వరి' వంటి చిత్రాలతో గజాలా మంచి పేరు తెచ్చుకుంది. తరువాత అవకాశాలు తగ్గడంతో తెరమరుగైంది.

  • Loading...

More Telugu News