: పోలీసుల అదుపులో 200 మంది నైట్ రోమియోలు... నేడు పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్
భాగ్యనగరి హైదరాబాదులో రోమియోలు రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోడ్లపైకి వస్తున్న రోమియోల కారణంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి పాతబస్తీ పరిధిలోని టప్పాఛబుత్రలో సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 200 మంది నైట్ రోమియోలు పోలీసులకు పట్టుబడ్డారు. మైనారిటీ తీరని కుర్రాళ్లే వారిలో అధికంగా ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న రోమియోలందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, నేటి ఉదయం తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.