: సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న భూమా, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి
సీఎం చంద్రబాబు నివాసానికి భూమా నాగిరెడ్డి, కూతురు అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి కాస్సేపటి క్రితం చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, అచ్చెన్నాయుడు కూడా సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. టీడీపీలో చేరనున్న నేతలకు పార్టీ కండువాలను కప్పి లాంఛనంగా టీడీపీలోకి బాబు ఆహ్వానించనున్నారు. కాగా, ఎమ్మెల్యేలు భూమా, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డిలు టీడీపీలో చేరడం లాంఛనప్రాయమే. కాగా, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా టీడీపీ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం.