: క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని నిమిషాల క్రితం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ల సమావేశం నుంచి నేరుగా చంద్రబాబు ఇక్కడికి వచ్చారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటాశ్రీనివాస్ తదితరులు ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ తో సమావేశం కానున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి, ఆయన పిన్ని లక్ష్మీదేవమ్మ, టీడీపీ కార్యకర్తలతో కూడా బాబు సమావేశం కానున్నట్లు సమాచారం. కాగా, అన్ని జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు ఇక్కడికి చేరుకున్నారు.