: తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి వచ్చాను: భూమా నాగిరెడ్డి


కాస్సేపటి క్రితం విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడమని కోరినప్పటికీ అందుకు భూమా నాగిరెడ్డి తిరస్కరించారు. ‘తెలుగుదేశం పార్టీలో చేరేందుకే ఇక్కడికి వచ్చాను. అందులో రహస్యమేముంది బ్రదర్?’ అని విలేకరులతో ఆయన అన్నారు. సీఎంతో మాట్లాడిన తర్వాతే విలేకరులతో మాట్లాడతానని ఆయన చెప్పారు. కాగా, టీడీపీ శ్రేణులు భారీగా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నాయి.

  • Loading...

More Telugu News