: బీప్ సాంగ్ వివాదంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శింబు
బీప్ సాంగ్ వివాదంలో నిండా మునిగిన కోలీవుడ్ నటుడు శిలంబరసన్ (శింబు) ఎట్టకేలకు పోలీసుల ముందుకు వెళ్లాడు. తమిళనాడులోని కట్టూరు పోలీస్ స్టేషన్ కు న్యాయవాదులు, తండ్రి టి.రాజేందర్ తో కలిసి శింబు వెళ్లాడు. స్టేషన్ లో అసిస్టెంట్ కమిషనర్, ఇన్ స్పెక్టర్ ను కలిశాడు. అనంతరం మాట్లాడుతూ, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలిపాడు. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని అన్నాడు. ఆపై ఏం జరుగుతుందనేది దేవుడి చేతుల్లో ఉందని అన్నాడు. ఇంతకీ పోలీసులు ఏమడిగారని ప్రశ్నించగా, సమాధానం దాటవేశాడు. వివాదాస్పద బీప్ సాంగ్ వ్యవహారం కారణంగా శింబు కొంత కాలం అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.