: కొన్ని సంఘటనలు మంచి అనుభవాన్ని ఇచ్చాయి: దీపికా పదుకొనే


నేను ప్రేమించే వ్యక్తి నాకే సొంతం కావాలనుకునే వ్యక్తిని తానని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తెలిపింది. 'ట్రిపుల్ ఎక్స్-ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' అనే హాలీవుడ్ సినిమాలో దీపిక అవకాశం పొందిన నేపథ్యంలో రణ్ వీర్ సింగ్ తో ప్రేమాయణం గురించి మీడియా ఆమెను ప్రశ్నించింది. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ, రిలేషన్ షిప్స్ లో చాలా రకాలు ఉంటాయని తెలిపింది. తన మనసులో తన భర్తకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదని చెప్పింది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తనకు మంచి అనుభవాన్ని ఇచ్చాయని దీపిక వెల్లడించింది. 'నేను ప్రేమించిన వ్యక్తి నాకే సొంతం' అనుకునే రకానికి చెందిన వ్యక్తిని తానని చెప్పింది.

  • Loading...

More Telugu News