: డ్రీమ్ లైనర్ విమానంలో మరో సమస్య


ఇంధన వినియోగం తగ్గించడంలో భాగంగా తేలికపాటి మిశ్రమపదార్థాలతో డ్రీమ్ లైనర్ విమానాలను తయారుచేశారు. 2011లో నిప్పన్ ఎయిర్ వేస్ సంస్థ ఈ డ్రీమ్ లైనర్ విమానాలను ప్రవేశపెట్టింది. 2013లో నిప్పన్ విమానాల్లో విద్యుత్ సరఫరా చేసే బ్యాటరీ వేడెక్కిపోయేది. ఓ విమానంలో అగ్నిప్రమాదం కూడా సంభవించింది. తాజాగా, ఈ విమానాల్లో ఇంకో సమస్య తలెత్తింది. కౌలాలంపూర్ నుంచి జపాన్ లోని నరితా ఎయిర్ పోర్టుకు జపాన్ ఎయిర్ వేస్ కు చెందిన నిప్పన్ డ్రీమ్ లైనర్ విమానం బయల్దేరింది. ప్రయాణం ప్రారంభించిన గంటకు ఈ విమానంలోని కుడి వైపున్న ఇంజిన్ వేడెక్కడం మొదలైంది. దీనిని గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కితిప్పి మళ్లీ కౌలాలంపూర్ లో ల్యాండ్ చేశారు. ఈ సమయంలో 203 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు. దీంతో ఈ సమస్య ఎందుకు తలెత్తింది? అనే విషయాన్ని అధికారులు ఆరాతీస్తున్నారు. బ్యాటరీ వేడెక్కకుండా ప్రత్యామ్నాయం కనుగొంటున్న తరుణంలో మరో సమస్య నిప్పన్ ఎయిర్ వేస్ ముందుకు రావడం ఈ సంస్థను ఇబ్బంది పెడుతోంది.

  • Loading...

More Telugu News