: షూటింగుకి వెళ్లేటప్పుడు క్రికెట్ కిట్ తీసుకెళతాను: బాలకృష్ణ
కాలేజీ రోజుల్లో క్రికెట్, కబడ్డీ బాగా ఆడేవాడినని, ఇప్పటికీ షూటింగుకి వెళ్లేటప్పుడు తనతో పాటు క్రికెట్ కిట్ ఉంటుందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. హైదరాబాదులోని మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాన్సెప్ట్ ప్లే, ఫుడ్ ఏరియా స్ట్రీట్ ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన సరదాగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, తాను చిన్నతనంలో ఆటలు బాగా ఆడేవాడినని, లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో చదువుతున్నప్పుడు వాలీబాల్ టీమ్ కెప్టెన్ గా ఉన్నానని, టేబుల్ టెన్నిస్ క్రీడ కూడా బాగా ఆడేవాడినని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. షూటింగ్ కు వెళ్లేటప్పుడు క్రికెట్ కిట్ తన వెంట తీసుకువెళతానని, సమయం దొరికినప్పుడు తోటి నటీనటులతో కలిసి క్రికెట్ ఆడుకుంటామని చెప్పారు.