: ఆమరణ దీక్షకు దిగిన మాజీ ఎమ్మెల్యే కాంతారావు


సింగరేణి గనుల కారణంగా నిర్వాసితులైన గిరిజనులకు తక్షణం పూర్తి పరిహారం ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఖమ్మం జిల్లా మణుగూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాంతారావు ఈ ఉదయం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. ఇళ్లు, పొలాలను కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని, బాధితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాంతారావు దీక్షతో మణుగూరు ప్రాంతంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా గిరిజన గ్రామాల ప్రజలు తరలివస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News