: ఈ పుస్తకం ధర మూడు కోట్ల 12 లక్షలు!


ఓ పాత పుస్తకానికి అత్యధిక ధర లభించిన సంఘటన డల్లాస్ లో జరిగింది. స్పైడర్ మ్యాన్ మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చిన కామిక్ పుస్తకానికి సుమారు 4,54,100 డాలర్లు చెల్లించి దానిని సొంతం చేసుకున్నాడు, పేరు వెల్లడించని ఓ వ్యక్తి. మన కరెన్సీలో అయితే ఆ పుస్తకం ధర సుమారు రూ. 3.12 కోట్లు. డల్లాస్ కు చెందిన ప్రముఖ వేలం సంస్థ హెరిటేజ్ పుస్తకాల వేలం పాట నిర్వహించింది. ఈ వేలంలో పెట్టిన ఇతర స్పైడర్ మ్యాన్ కామిక్ బుక్ లకు లభించనంత ఆదరణ ఈ పుస్తకానికి దక్కింది. న్యూయార్క్ కు చెందిన వాసి వాల్టర్ యకోబోస్కి 1980లో పలు రకాల కామిక్ పుస్తకాలను కొనుగోలు చేశాడు. అందులో ఈ పుస్తకం కూడా ఉంది. అప్పట్లో దీనిని 1200 డాలర్లకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఈ పుస్తకానికి ఊహించనంత ఎక్కువ ధర పలకడంతో యకోబోస్కి ఆనందానికి అంతులేదు. కాగా, 1962లో ఎడిషన్ అమేజింగ్ ఫాంటసీ పుస్తకం 2011లో 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడుబోయిన రికార్డు ఉంది.

  • Loading...

More Telugu News