: నేను గడియారం, ఉంగరం పెట్టుకోను... కనీసం జేబులో డబ్బులు కూడా పెట్టుకోను: చంద్రబాబు


తాను కనీసం చేతికి గడియారం, వేలికి ఉంగరం, కనీసం జేబులో డబ్బులు కూడా పెట్టుకోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అక్రమంగా ఆస్తులు సంపాదించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తన ఫ్యామిలీపై ప్రతిపక్షనేతలు దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన కుమారుడు, కోడలు అవినీతితో కూడిన ఆస్తులు సంపాదించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరూ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చారని ఆయన తెలిపారు. వారిద్దరూ పట్టభద్రులని, వ్యాపారం చేసుకుంటూ, ట్రస్టు వ్యవహారాలు చూసుకుంటున్నారని ఆయన చెప్పారు. అలాంటి వారికి అవినీతి సంపాదనకోసం అర్రులు చాచాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. సింగపూర్ వెళ్తే...అక్కడ ఆస్తులున్నాయని అంటున్నారని తెలిపిన ఆయన, సింగపూర్ అవినీతి సంపాదనతో పెరిగిన దేశం కాదని, అక్కడ ఏమాత్రం అవినీతి లేదని, అందుకే దానిని అభిమానిస్తానని చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు తన ఆస్తులపై వివరణ ఇచ్చానని, లేదంటే తనకేమైనా ఆక్రమాస్తులు వుంటే నిరూపించాలని ముఖ్యమంత్రి సవాలు విసిరారు. అలా ఎవరైనా తన అక్రమాస్తులు చూపిస్తే వారికి ఆ ఆస్తులను ఇచ్చేస్తానని ఆయన తెలిపారు. అలాంటి ఆరోపణలు మానాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News