: నిన్నటితో పోలిస్తే నేడు పరిస్థితులు చక్కబడ్డాయి: హర్యానా డీజీపీ
హర్యానాలో నిన్నటితో పోలిస్తే నేడు పరిస్థితులు చక్కబడ్డాయని డీజీపి యశ్ పాల్ సింఘాల్ తెలిపారు. త్వరలో పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకువస్తామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జవాన్లు కవాతు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పది కంపెనీల పారామిలటరీ బలగాలను రాష్ట్రానికి రప్పించామని, మరో 23 కంపెనీల పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి రానున్నాయని ఆయన వెల్లడించారు. రోహ్ తక్, ఝజ్జర్, భివాండీ ప్రాంతాల్లో కర్ఫ్యూ నేడు కూడా కొనసాగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనలపై కేసులు నమోదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ఆందోళనలకు యువకులు, విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన కోరారు.