: టీడీపీలో చేరిన 40 మంది గుంటూరు జిల్లా సర్పంచ్ లు
నలభై మంది గుంటూరు జిల్లా సర్పంచ్ లు టీడీపీ గూటికి చేరారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు కాటూరి శ్రీనివాస్ కూడా టీడీపీలో చేరారు. రాష్ట్ర అభివృద్ధిని చూసే టీడీపీలో చేరేందుకు ముందుకొస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సీఎం అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కాంగ్రెస్, వైసీపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. చివరకు నదుల అనుసంధానంపైనా విమర్శలు చేయడమేంటని బాబు ప్రశ్నించారు.