: టీడీపీ ఇమేజ్ తగ్గుతోంది, అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు: ఎస్వీ మోహన్ రెడ్డి
టీడీపీ ఇమేజ్ తగ్గిపోతుండటం, ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందువల్లే ఇతర పార్టీల నేతలను లాక్కునే ప్రయత్నం చేయాలని చూస్తోందని వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. అంతేగాక ప్రభుత్వం తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఈ వివాదాలు, అవినీతి నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ ఇటువంటి ప్రచారం చేస్తోందని ఎస్వీ విమర్శించారు. అందుకని తామెవరం ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైసీపీలో ఉన్నందువల్ల తమకెలాంటి నష్టంగానీ, టీడీపీలోకి వెళ్లినందువల్ల ఎలాంటి లాభంగానీ లేవని పేర్కొన్నారు.