: ముగ్గురు జేఎన్ యూ విద్యార్థులపై లుక్ అవుట్ నోటీసులు


జేఎన్ యూ వివాదంపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జేఎన్ యూలో ఫిబ్రవరి 9న జరిగిన ఘటనలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారని భావిస్తున్న ముగ్గురు విద్యార్థులపై తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పరారీలో ఉన్న ఆ విద్యార్థులను ట్రేస్ చేయాలంటూ దేశంలోని ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు సంబంధిత అధికారులకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. అంతేగాక సంబంధిత విద్యార్థులను వెతికేందుకు, వారి స్నేహితులను ప్రశ్నించేందుకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ అధికారులు, పలు బృందాలు రంగంలోకి దిగాయి.

  • Loading...

More Telugu News