: నాలుగున్నరేళ్లు సాగిన కేసుకు మూడు గంటల కౌన్సిలింగుతో శుభం కార్డు!


అది భార్యాభర్తల విడాకుల కేసు. విడాకులు కావాలంటున్న భర్త. ససేమిరా అన్న భార్య... కేసు దాదాపు నాలుగున్నరేళ్లు సాగింది. అలాగే కొనసాగితే, ఇంకా ఎన్నేళ్లు సాగేదో? న్యాయమూర్తి కల్పించుకుని ఆ జంటను కూర్చోబెట్టి మూడు గంటల పాటు కౌన్సిలింగ్ ఇవ్వగా, ఆయన సలహాలు, వారికి భవిష్యత్ పై ఆశలను రేపాయి. దీంతో వారిద్దరూ కలిసే ఉండటానికి నిర్ణయించుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం పరిధిలోని గాజువాక ప్రాంతానికి చెందిన రాజగోపాల్ కు 2008లో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కాపురంలో కలతలు రేగగా, 2011లో విడాకులు కావాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. భర్త పిటిషన్ కు భార్య సమాధానమే ఇవ్వలేదు. తాను కాపురమే చేస్తానని ఎప్పుడు వాయిదాకు వచ్చినా న్యాయమూర్తికి మొరపెట్టుకునేది. ఈలోగా కోర్టులో న్యాయమూర్తులు కూడా మారారు. భార్య మనోగతాన్ని తెలుసుకున్న ప్రస్తుత జడ్జి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆపై కలిసే ఉంటామంటూ అంగీకార పత్రాన్ని ఇచ్చిన ఆ జంట, తమ పిల్లలతో కలసి ఇంటికి వెళ్లడంతో ఈ కేసులో శుభం కార్డు పడ్డట్లయింది.

  • Loading...

More Telugu News