: అమెరికాలో నార్కో-టెర్రరిజం... దావూద్ ఇబ్రహీం మేనల్లుడు సొహైల్ కస్కర్ అరెస్ట్


విదేశీ ఉగ్రవాద సంస్థలకు సహాయం చేయడం, మిసైల్ లాంచింగ్ వ్యవస్థలను చట్ట వ్యతిరేకంగా విక్రయించడం, మాదక ద్రవ్యాల సరఫరా వంటి ఆరోపణలతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు సొహైల్ కస్కర్ అలియాస్ అలీ దానిష్ ను అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబియాకు చెంది ఎఫ్ఏఆర్సీ టెర్రరిస్టు గ్రూప్ కు ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను పేల్చే మిసైల్స్ ను విక్రయించడంతో పాటు హెరాయిన్ సరఫరా చేస్తున్న సొహైల్ ను డిసెంబర్ లోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సొహైల్ తో పాటు మరో ఇద్దరు పాకిస్థానీ జాతీయులను అదుపులోకి తీసుకోగా, మేనల్లుడిని కాపాడుకునేందుకు దావూద్ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తన డబ్బు, పలుకుబడిని ఉపయోగించి సొహైల్ విడుదలకు ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అమెరికాలో పేరున్న టామ్ కినిఫ్ అనే హై ప్రొఫైల్ లాయర్ ను దావూద్ నియమించాడు. అయితే, ఈ కేసులో ఆరోపణలు రుజువైతే 25 ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News