: మేడారంలో పోలీసుల తీరుపై బాబుమోహన్ అసహనం!
మేడారంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్ కు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలు వెళ్లే గేటుకు డీఎస్పీ తాళం వేసి వెళ్లిపోవడంతో కొద్ది సేపు ఆయన అక్కడే నిలబడాల్సి వచ్చింది. దీంతో ఇబ్బందిపడ్డ ఆయన పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చివరకు, వీఐపీ గేటు తాళం పగులగొట్టి ఆయన్ని లోపలికి పంపించారు. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ, పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని.. ఈ సంఘటనపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.