: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు.. టీ సర్కార్ ఉత్తర్వులు
తెలంగాణాలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరికి మూడు స్లాబుల్లో వేతనాలు పెంచింది. ప్రస్తుతం రూ.6,500, రూ.8,400, రూ.10,900 జీతాలు తీసుకుంటున్న వారికి పెరిగిన వేతనాల ప్రకారం వరుసగా రూ.12,000, రూ.15,000, రూ.17,500 వస్తాయి. ఈ పెరిగిన వేతనాలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఈ వేతనాల పెంపు వల్ల మొత్తం 45 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.