: చంద్రబాబు సింగపూర్ వెంట ఎందుకు పడుతున్నారు?: దిగ్విజయ్ సింగ్
మన దేశంలో సమర్ధమైన కంపెనీలు ఎన్నో ఉన్నప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సింగపూర్ వెంట పరుగులు పెడుతున్నారని, ఎందుకో అర్థం కావట్లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. చంద్రబాబు కేబినెట్ లో ఎస్సీలు, మైనార్టీలకు అవకాశమివ్వలేదని, ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చలేదని విమర్శించారు. ఏపీలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై కూడా ఆయన విమర్శల వర్షం కురిపించారు. విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ అంశంపైన కానీ, సొంత నియోజకవర్గ సమస్యలపైన కానీ ఆయన ఏ రోజూ మాట్లాడలేదని దిగ్విజయ్ అన్నారు.