: జాతీయ గీతం వింటే గుండె ఉప్పొంగుతుంది: శిఖర్ ధావన్


జాతీయగీతం వింటే గుండె ఉప్పొంగుతుందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ధావన్ మాట్లాడుతూ, ఆట ప్రారంభానికి ముందు జాతీయగీతం స్పూర్తి నింపుతుందని అన్నాడు. ఇది కేవలం తనను మాత్రమే కాదని, యావత్ జాతిని మేల్కొల్పుతుందని ధావన్ చెప్పాడు. యూనివర్సిటీల్లో జాతీయ జెండా ఎగురవేయాలన్న నిర్ణయం మంచిదని ధావన్ అభిప్రాయపడ్డాడు. తమలోని జాతీయతా భావమే తమకు అశేషమైన అభిమానగణాన్ని, దీవెనలను అందిస్తోందని ధావన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News