: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం


హర్యానాలోని గుర్గావ్ లో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న తనూ ప్రభాకర్ (29) అదృశ్యమైంది. ఫిబ్రవరి 17న విధులకు వచ్చిన ఆమె లంచ్ సమయంలో భోజనం చేస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఆ తరువాత ఆమె కనిపించలేదు. దీంతో సహోద్యోగులు ఆమె సెల్ కు కాల్ చేసినా సమాధానం లేదు. దీంతో ఆమె మెయిల్ కు మెసేజ్ పెట్టారు. అయితే సొంత పని మీద కొన్నాళ్లు వేరే ఊరు వెళ్తున్నానని సహోద్యోగులకు ఆమె మెయిల్ ద్వారా సమాధానం పెట్టింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆమె ప్రియుడు ప్రిన్స్ పాఠక్ ఆమెను కిడ్నాప్ చేశాడని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News