: కొడుకు క్యాన్సర్ పై పుస్తకాన్ని రాస్తున్న బాలీవుడ్ హీరో


మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'అజర్' చిత్రంలో హీరోగా నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తన మనసులోని బాధను పంచుకునేందుకు కలాన్ని చేతపట్టాడు. ఇమ్రాన్ కుమారుడు అయాన్ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో బాధపడిన సమయంలో, క్యాన్సర్ పై అయాన్ పోరాడిన తీరును తన కథాంశంగా ఎంచుకున్నాడు. "ది కిస్ ఆఫ్ లవ్: హౌ ఏ సూపర్ హీరో అండ్ మై సన్ డిఫీటెడ్ క్యాన్సర్" పేరిట పుస్తకాన్ని రాస్తున్నట్టు తెలిపాడు. ఇంగ్లీష్ తో పాటు హిందీ, మరాఠి భాషల్లో ఇది విడుదలవుతుందని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News