: బీహెచ్ యూ డాక్టరేట్ తిరస్కరించిన మోదీ
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్ యూ) తనకు ప్రదానం చేయాలనుకున్న గౌరవ లా డిగ్రీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరస్కరించారు. అలాంటి డిగ్రీలు స్వీకరించడం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న బీహెచ్ యూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం జరగనుంది. ఇందుకు మోదీ హాజరుకానున్నారు. ప్రజాసేవలో ప్రభుత్వాధిపతిగా, సంస్కర్తగా చేస్తున్న విశిష్ట సేవలకుగాను ఆ సమయంలో మోదీకి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయాలని వర్సిటీ అధికారులు భావించారు. ఆ విషయాన్నే ఆయనకు తెలిపారు. కానీ అలాంటివి స్వీకరించడం తనకు ఇష్టంలేదని చెప్పారని వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.