: చంద్రబాబు కార్యాలయం కింద మంటలు... ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది


హైదరాబాదులోని సచివాలయంలో నేటి ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ‘ఎల్’ బ్లాకును కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ బ్లాకులో టాప్ ఫ్లోర్ లో చంద్రబాబు కార్యాలయం ఉంది. నేటి ఉదయం ఉన్నట్టుండి ఎల్ బ్లాకు కింది ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో వెనువెంటనే అప్రమత్తమైన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పై ఫ్లోర్ లో సీఎం కార్యాలయం ఉన్న బ్లాక్ లోనే అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మంటలు మరింత మేర విస్తరించకముందే ఫైర్ సిబ్బంది వాటిని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News