: డిగ్గీ రాజా సెక్యూరిటీ వాహనాన్ని ఢీకొన్న కావేరీ ట్రావెల్స్ బస్సు


తెలంగాణలోని నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలో నేటి తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కాన్వాయ్ లోని సెక్యూరిటీ వాహనాన్ని ఎదురుగా వచ్చిన కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వేగంగా స్పందించిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన డిగ్గీ రాజా నిన్న తెలంగాణ వ్యవహారాలపై సమీక్ష జరిపారు. తాజాగా నేటి ఉదయం ఆయన విజయవాడలో ఏపీసీసీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతున్న ఆయన కాన్వాయ్ లోని సెక్యూరిటీ వాహనం ప్రమాదానికి గురైంది.

  • Loading...

More Telugu News