: మేడారం బయలుదేరిన సమ్మక్క
చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారం బయలుదేరింది. గౌరవసూచకంగా ఎస్పీ కిషోర్ గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానించారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని పూజారులు గద్దెపైకి చేర్చనున్నారు. అమ్మవారి వెంట తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వాకాటి కరుణ, తదితరులు ఉన్నారు. కాగా, సమ్మక్క-సారలమ్మ కొలువు దీరే గద్దెల వద్ద భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం వరకు సుమారు 20 లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు.