: కన్నయ్యకు మద్దతుగా తమిళనాడులో ఆందోళన...60 మంది అరెస్టు


తీహార్ జైలులో దేశద్రోహం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కు మద్దతుగా చెన్నైలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ఇలాంటి ఆరోపణలతో గతంలో అరెస్టు అయిన జానపద కళాకారుడు కోవన్ కూడా పాల్గొన్నారు. ఈ ఆందోళనలో కన్నయ్య కుమార్ అరెస్టు, పటియాలా కోర్టు ఆవరణలో అతనిపై లాయర్ల దాడిని ఖండించారు. కన్నయ్యను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రంగప్రవేశం చేసిన పోలీసులు, 60 మందిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News