: విశాఖలో 'సమీర్' ప్రత్యేక పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన


విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియం ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న 'సమీర్' (సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్) ప్రత్యేక పరిశోధన కేంద్రానికి ఇవాళ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో రూ.80.02 కోట్లతో 'గంభీరం ఐటీ సెజ్'లో ఏర్పాటు కాబోతోంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ సెంటర్, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే 'సమీర్'... విశాఖలో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇంటర్ ఫిరెన్స్ అండ్ కంపాటిబిలిటీ విభాగంలో పరిశోధనలు చేస్తుంది.

  • Loading...

More Telugu News