: రాహుల్ గాంధీ దేశ ద్రోహి!... ఉరేయాలి లేదా కాల్చేయాలి: బీజేపీ నేత ఘాటు వ్యాఖ్య


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే కైలాష్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని దేశ ద్రోహిగా అభివర్ణించిన ఆయన కాంగ్రెస్ యువ నేతను ఉరేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాల్చిపారేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లా బైతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న చౌదరి... నిన్న తన సొంత రాష్ట్రంలో జరిగిన రైతు సమ్మేళన్ లో పాల్గొన్న సందర్భంగా రాహుల్ గాంధీపై ఫైరయ్యారు. జేఎన్ యూ ఘటనలో అఫ్జల్ గురుకు అనుకూలంగా ర్యాలీ తీసిన విద్యార్థులకు సంఘీభావంగా రాహుల్ మాట్లాడటం ముమ్మాటికీ దేశ ద్రోహమేనని వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు మద్దతు తెలిపే వ్యక్తులు... రాహుల్ గాంధీ అయినా, మరొకరైనా దేశ ద్రోహులేనని ఆయన తేల్చిచెప్పారు. అలాంటి దేశ ద్రోహులను ఉరి తీయాలి లేదా, కాల్చి పారేయాలని అన్నారు. రైతు సమ్మేళన్ లో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్న ఆయన, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఆ తర్వాత తనను సంప్రదించిన నేషనల్ మీడియాతో అన్నారు. చౌదరి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్నే రేపనున్నాయి.

  • Loading...

More Telugu News