: అగ్రిగోల్డ్ లో అరెస్ట్ పర్వం... ముగ్గురు డైరెక్టర్ల అరెస్ట్


నాలుగు రాష్ట్రాల్లో లక్షలాది జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ యాజమాన్యం భరతం పట్టేందుకు ఎట్టకేలకు ఏపీ సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. నిన్నటిదాకా అగ్రిగోల్డ్ వ్యవస్థాపకుల పట్ల కాస్తంత మెతక వైఖరి అవలంబించిన సీఐడీ అధికారులు... హైకోర్టు తలంటడంతో కఠిన చర్యలకు తెరలేపక తప్పలేదు. ఇప్పటికే ఈ నయా మోసంలో కీలక పాత్రధారులుగా వ్యవహరించిన సంస్థ చైర్మన్ అవ్వాస్ వెంకటరామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వాస్ వెంకట శేషునారాయణరావులను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఏలూరు కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. నేడు వెంకటరామారావును హైదరాబాదు తరలించనున్న సీఐడీ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారాన్ని కక్కించే యత్నం చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరో అడుగు ముందుకేసిన సీఐడీ... సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేసింది. సంస్థ డైరెక్టర్లుగా కొనసాగుతున్న సదాశివ వరప్రసాద్, శ్రీరామచంద్రరావు, అహ్మద్ ఖాన్ లను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు మరికాసేపట్లో వారిని ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నారు.

  • Loading...

More Telugu News