: సినీ హీరో లుక్కులో విరాట్ కోహ్లీ!... ‘ర్యాన్’ యాడ్ లో సుత్తి పట్టిన టెస్టు కెప్టెన్
క్రికెట్ బ్యాటుతో దర్శనమివ్వాల్సిన టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ నిన్న ఓ పెద్ద సుత్తి చేతబట్టి కనిపించాడు. సినిమాల్లో విలన్లపై విరుచుకుపడే క్రమంలో హీరోలు సుత్తి తరహా ఆయుధాలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఆ తరహాలోనే కోహ్లీ కూడా సుత్తి పట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? అన్న అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే... విజయవంతమైన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ తనను తాను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ‘ర్యాన్’ పేరిట స్పెషల్ కలెక్షన్ దుస్తుల బ్రాండ్ ను అతడు ఆవిష్కరించాడు. మరికొందరు వ్యాపార భాగస్వాములతో కలిసి అతడు సదరు బ్రాండ్ ను మార్కెట్లోకి తెచ్చాడు. సదరు బ్రాండ్ కు అంబాసిడర్ గా కూడా తానే రంగంలోకి దిగేశాడు. తన బ్రాండ్ దుస్తులతో మెరిసిపోయిన అతడు, మరింత కిక్కు ఇచ్చేందుకు చేతితో సుత్తి పట్టి దర్శనమిచ్చాడు. ఈ యాడ్ లో కోహ్లీ యాంగ్రీ యంగ్ హీరోలా కనిపిస్తున్నాడు.