: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజు రోజే ‘ఒక మనస్సు’ విడుదల !


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం రిలీజు రోజే మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారిక హీరోయిన్ గా నటించిన 'ఒక మనస్సు' చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ‘ఒక మనస్సు’ ఫిల్మ్ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 8వ తేదీన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల చేస్తామని ఈ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ తేదీన ఇతర కొత్త చిత్రాలను విడుదల చేసేందుకు చాలా మంది నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు. కానీ, ‘ఒక మనసు’ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఇందుకు మినహాయింపని చెప్పవచ్చు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం విడుదల కానున్న తేదీ నాడే తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని... అందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News