: ఒక అభిమాని మా స్విమ్మింగ్ పూల్ లో ఈతకొట్టాడు: షారూక్ ఖాన్


ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఇంటి ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఆయన అభిమాని ఒకరు ఈత కొట్టాడు. అది కూడా ఎవరి అనుమతీ తీసుకోకుండా షారూక్ ఇంట్లోకి చొరబడి ఈ పని చేశాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ బాద్ షా నే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం ఫ్యాన్ అనే చిత్రంలో నటిస్తున్న షారూక్ తన అభిమానులతో ఎదురైన అనుభవాల గురించి ప్రస్తావించాడు. ముఖ్యంగా తన స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన అభిమాని గురించి చెప్పాడు. ఒక రోజు రాత్రి ముంబయిలో ఆ అభిమాని షారుక్ ఇంట్లోకి చొరబడి.. ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకేశాడు. సెక్యూరిటీ గార్డు అతన్ని పట్టుకుని ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే.. తాను షారూక్ అభిమానినని.. ఈ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయాలన్నది తన కోరిక అని చెప్పాడట. ఈ విషయం గురించి షారుక్ చెబుతూ, ఈ తతంగమంతా తెలిసి తాను బయటకు వచ్చి ఆ అభిమానిని ఆప్యాయంగా పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలిపాడు.

  • Loading...

More Telugu News