: పాటలు విన్నాడని నడి బజార్లో బాలుడి తల నరికేశారు


పాశ్చాత్య సంగీతం విన్నాడన్న కారణంతో ఓ బాలుడి తలను నడిబజార్లో అత్యంత పాశవికంగా నరికేసిన సంఘటన ఇరాక్ లోని మోసూల్ పట్టణంలో చోటుచేసుకుంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న మోసూల్ పట్టణంలో హుస్సేన్ అనే బాలుడు తండ్రి అంగట్లో కూర్చుని పాటలు వింటున్నాడు. ఇంతలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హుస్సేన్ ను అదుపులోకి తీసుకుని, షరియత్ కోర్టులో హాజరుపరిచారు. అతని నేరం విన్న షరియత్ కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో నడి బజార్లో అందరూ చూస్తుండగా బాలుడి తలనరికి హత్య చేశారు. దీనిపై స్థానికుల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. పాశ్చాత్య సంగీతంపై నిషేధం లేదని, నిషేధం లేకుండా నరికి చంపడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News