: 'కాల్చిచంపండి, ఉరి తీయండి' అంటూ కన్నయ్యపై లాయర్ల దాడి, గాయాలు!
దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ ను నేడు పాటియాలా కోర్టుకు తీసుకువచ్చిన వేళ, లాయర్లు అతనిపై దాడి చేసి గాయపరిచినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో చుట్టూ పోలీసులు ఉండి కూడా ఏమీ పట్టించుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 200 మందికి పైగా లాయర్లు కన్నయ్యను చుట్టుముట్టి "అతడిని కాల్చి చంపండి, ఉరి తీయండి" అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఆపై అతనిపై దాడి జరుగగా, తొక్కిసలాట మధ్య చిక్కుకున్న కన్నయ్య చిత్రాలూ వెలుగులోకి వచ్చాయి. ఆపై తామనుకున్నది చేయగలిగామని లాయర్లు వ్యాఖ్యానించడం గమనార్హం.