: అరుణాచల్ లో రాష్ట్రపతి పాలన తొలగింపు!


అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రపతి పాలన నుంచి తిరిగి ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 'ప్రెసిడెంట్ రూల్'ను తొలగించాలని కేంద్ర క్యాబినెట్ సిఫార్సు చేసింది. ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాజకీయ సంక్షోభం తలెత్తడంతో గత నెలలో అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర మంత్రివర్గం నిర్ణయానికి ప్రణబ్ ఆమోదం పలికితే, ఆరుణాచల్ లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటుకు, లేదా ఎన్నికలకు అవకాశాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News