: 18న విశాఖకు రాజ్ నాథ్ సింగ్
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్టణానికి రానున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఆయన విశాఖ చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ రాత్రికి విశాఖపట్టణంలోనే బస చేసి, మరుసటి రోజు ఒడిశా చేరుకుంటారు. ఈ సమీక్షా సమావేశంలో వామపక్ష తీవ్రవాదంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.