: వరల్డ్ కప్ నాటికి పూర్తి ఫిట్ నెస్ తో ఉంటా: షేన్ వాట్సన్
టీట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభమయ్యే నాటికి పూర్తి ఫిట్ నెస్ తో ఉంటానని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ తెలిపాడు. ఉదరసంబంధ సమస్యతో బాధపడుతున్న వాట్సన్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ లో టీట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ జట్టులో చోటుదక్కించుకున్న 15 మంది సభ్యుల్లో షేన్ వాట్సన్, జేమ్స్ ఫల్కనర్, నాధన్ నైల్, ఆరోన్ ఫించ్ గాయాలతో బాధపడుతున్నారు. వీరంతా వరల్డ్ కప్ ప్రారంభం నాటికి పూర్తి ఫిట్ నెస్ సాధిస్తారని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశాభావం వ్యక్తం చేసింది.