: ఉద్యోగులకు శుభవార్త... పీఎఫ్ పై పెరిగిన వడ్డీ!


ఇండియాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధిని పొందుతూ భవిష్య నిధి (పీఎఫ్)లో భాగమైన వారందరికీ శుభవార్త. పీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటును స్వల్పంగా పెంచుతూ నిర్ణయం వెలువడింది. ఈ మధ్యాహ్నం సమావేశమైన ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ట్రస్టీ సభ్యులు 2015-16 సంవత్సరానికిగాను భవిష్యనిధి వడ్డీ శాతాన్ని 8.8 శాతంగా ఖరారు చేశారు. 2014-15లో వడ్డీ 8.75 శాతం కాగా, ఈ ఏడు దాన్ని 5 బేసిస్ పాయింట్ల మేరకు పెంచుతున్నామని వెల్లడించారు. పెరిగిన ద్రవ్యోల్బణం, మారిన మార్కెట్ గమనం కారణంగా వడ్డీ రేటును మరింతగా పెంచలేకపోయామని ఈపీఎఫ్ఓ ట్రస్టీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News