: రౌడీలు కొట్టడంతో అవమానభారంతో యువకుడి ఆత్మహత్య!
మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదన్న కారణంతో రౌడీలు ఒక యువకుడిని దారుణంగా కొట్టిన సంఘటన హైదరాబాద్ లోని బోరబండలో చోటుచేసుకుంది. ఈ సంఘటనను అవమానకరంగా భావించిన సదరు యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.