: చంద్రబాబుకు ముద్రగడ లేఖ... రుణాలకు కాలపరిమితి ఎత్తేయాలని వినతి


కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కొద్దిసేపటి క్రితం ఓ లేఖ రాశారు. కాపులకు రిజర్వేషన్ల కోసం ఇటీవల మూడు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ముద్రగడ ప్రభుత్వం ఇచ్చిన హామీతో దీక్ష విరమించారు. తాజాగా చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ పలు అంశాలను అందులో ప్రస్తావించారు. కాపులకు రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ పర్యటనను ఖరారు చేయాలని ఆ లేఖలో ముద్రగడ కోరారు. కాపులకు రుణాల విషయంలో కాలపరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక లబ్ధిదారుల ఎంపిక విషయంలో జన్మభూమి కమిటీలను దూరంగా పెట్టాలని ఆయన సీఎంను కోరారు.

  • Loading...

More Telugu News