: 'పాకిస్థాన్ జిందాబాద్' అంటున్న యువకుడిని చావగొట్టిన బీజేపీ ఎమ్మెల్యే!


భారత్ కు దీర్ఘకాల శత్రుదేశం పాకిస్థాన్ ను తన కళ్ల ముందే పొగుడుతూ ఉంటే ఆ ఎమ్మెల్యే తట్టుకోలేకపోయాడు. కారు దిగి తన అనుచరులతో కలసి దాడి చేశాడు. స్వయంగా నాలుగు పీకులు పీకాడు కూడా. ఈ ఘటన పాటియాలా హౌస్ కోర్టు సమీపంలో జరిగింది. బీజేపీకి చెందిన ఢిల్లీ ఎమ్మెల్యే ఓపీ శర్మ తన అనుచరులతో కలసి రోడ్డుపై వెళుతున్న వేళ, ఓ యువకుడు 'పాకిస్థాన్ జిందాబాద్' అని నినాదాలు చేస్తూ కనిపించాడు. వెంటనే పట్టరాని కోపంతో శర్మ, ఆయన అనుచరులు సదరు యువకుడిపై దాడికి దిగారు. దీన్ని చిత్రీకరించేందుకు మీడియా పెద్ద ఎత్తున చేరుకుంది. ఈ లోగా వచ్చిన పోలీసులు ఎమ్మెల్యే బారి నుంచి యువకుడిని కాపాడి, ఆపై అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఓపీ శర్మ దాడి ఘటన దృశ్యాలు అన్ని మీడియా చానళ్లకూ చిక్కి హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News