: టీఆర్ఎస్ గూటికి ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 'ఆకర్ష్' మంత్రం కొనసాగుతోంది. త్వరలో ఖమ్మం జిల్లా కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల జిల్లా నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఇద్దరు టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావులకు పార్టీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.