: అఫ్జల్ గురు అమరవీరుడైతే, హనుమంతప్ప ఎవరు? మనసును కదిలించే కవిత రాసిన రెజ్లర్ యోగేశ్వర్ దత్
మైదానంలో దిగి తన కుస్తీ పట్టుతో ప్రత్యర్థులను చిత్తు చేసే యోగేశ్వర్ దత్, అందరినీ ఆశ్చర్యపరుస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ కవిత ఇప్పుడు పలువురి మనసులను కదిలిస్తోంది. గతవారంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చోటు చేసుకున్న ఘటనలపై ఆయన ఈ కవితతో సూటి ప్రశ్నలను సంధించాడు. "పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురును అమరవీరుడని వ్యాఖ్యానిస్తున్నారు. మరి లాన్స్ నాయక్ హనుమంతప్పను ఏమని పిలవాలి? ఏ దేశంలో మీరు పుట్టారో, దాన్నే శత్రువంటున్నారు" అంటూ ఈ కవిత హిందీలో సాగుతుంది. యోగేశ్వర్ పెట్టిన ఈ కవితకు పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.