: ఆ పని చేస్తే ఊరి నుంచి తరిమికొట్టండి: గవర్నర్ నరసింహన్
నిత్యమూ మందు కొట్టి మహిళలను ఇబ్బంది పెడుతున్న వారిని ఊరిలో ఉంచరాదని, వారిని తరిమికొట్టాలని గవర్నర్ నరసింహన్ గిరిజన మహిళలకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సీతంపేటలోని ఐటీడీఏను సందర్శించి, అక్కడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులతో మాట్లాడవద్దని, ఆ విధంగానైనా వారిని తిరిగి బడిబాట పట్టించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, మహిళల వృత్తి, సంపాదన, ఖర్చు తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయం శక్తి సంఘాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు. గవర్నర్ సతీమణి సైతం మహిళలతో కలసిపోయి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.