: కాశ్మీర్ లో రోడ్డు టన్నెల్ కు ప్రతిపాదనలు!


కాశ్మీర్ లో పొడవైన రోడ్డు టన్నెల్ నిర్మించాలని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ), కేంద్రానికి ఒక ప్రతిపాదన చేసింది. శీతాకాలంలో గురెజ్ లో కురుస్తున్న భారీ మంచు కారణంగా మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతున్నాయని, ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఈ సొరంగమార్గాన్ని నిర్మించడమే పరిష్కారమార్గమని భావించారు. దీని నిర్మాణానికి సుమారు రూ.9,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు బీఆర్ఓ చీఫ్ ఇంజనీరు, బ్రిగేడియర్ ఎకె దాస్ పేర్కొన్నారు. రోడ్, ట్రాన్స్ పోర్ట్ తో పాటు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు తమ ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. రజ్థన్ ప్రాంతం నుంచి గురెజ్ వరకు ఉండే ఈ సొరంగ మార్గం పొడవు 18 కిలోమీటర్ల మేర ఉంటుందని చెప్పారు. కాగా, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చెనాని-నష్రీ టన్నెల్ 9.2 కిలోమీటర్ల మేర ఉంటుంది. వచ్చే ఏడాది నాటికి ఇది పూర్తవుతుంది. ఇది కూడా అదే రాష్ట్రంలో ఉంది. ఒకవేళ కాశ్మీర్ లో కొత్త రోడ్డు టన్నెల్ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తే కనుక దేశంలో ఇదే అతి పొడవైన రోడ్డు టన్నెల్ గా రికార్డులకెక్కుతుందని దాస్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News